హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. మిషన్ భగీరథ ట్యాంక్ నీరు వృధా

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుంచి నీరు వృథాగా పోతోంది. ట్యాంక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పెద్ద మొత్తంలో తాగునీరు వృథా అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓవైపు నీటి పొదుపుపై అవగాహన కల్పిస్తుండగా, మరోవైపు వృథా కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు.