హైదరాబాద్: 28°C
తెలంగాణ

6 బాటిళ్లు ఇవ్వాల్సిందే.. లేదంటే షాపు సీజ్..?

నల్గొండ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో దసరా పండుగ పేరుతో వైన్స్, బార్ల యజమానుల నుంచి అక్రమంగా మద్యం బాటిళ్లు వసూలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో దుకాణం నుంచి 6 బాటిళ్లు ఇవ్వాలని, ఇవ్వకపోతే షాపు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నట్లు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిధిలోని 36 వైన్స్, 5 బార్ల నుంచి మొత్తం 246 బాటిళ్లు వసూలు చేసినట్లు సమాచారం.