హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

కర్నూలు జిల్లా దేవరగట్టులో ఈ నెల 21న జరిగే బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోరారు. హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 190 మందిపై బైండోవర్ చర్యలు, 300 కర్రల స్వాధీనం, 50 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.