NGKL: జిల్లాలోని తిమ్మాజిపేట ప్రధాన రహదారిపై ఉన్న శ్రీలక్ష్మి బేకరీలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు యజామానికి సమాచారమిచ్చారు.విద్యుదాఘాతంతో మంటలు రేగినట్టు అనుమానిస్తున్నారు. ఫైర్ ఇంజన్ మంటల్ని అదుపులోకి తెచ్చింది. దాదాపు రూ.5 నుంచి 6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు.
తెలంగాణ
చెలరేగిన మంటలు బేకరి దగ్ధం


