హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భువనేశ్వరీ మాతగా బగళాముఖి అమ్మవారు

BPT: చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయాదశమి పర్వదినం సందర్భంగా పదవ రోజు అమ్మవారు భువనేశ్వరీ మాతగా దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల జీవితాల్లో కష్టాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సర్వ విజయాలు చేకూరాలని లోకకల్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ తెలిపారు.