హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నాయకుడు వీరేశం గౌడ్‌కు ఎమ్మెల్యే పరామర్శ

KNR: గంగాధర మండలం బూరుగుపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దూలం వీరేశం గౌడ్ అనారోగ్యంతో కరీంనగర్‌లోని అపెక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.