హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుర్గామాత మండపంలో ఘనంగా దీపారాధన

PDPL: కమాన్‌పూర్ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దీపాల వెలుగులతో మండపం శోభాయమానంగా మారగా, పరిసరాల్లో భక్తిభావం వెల్లివిరిసింది.