హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా వేళ మాంసం కొనుగోళ్ల జోరు

SKLM: జిల్లాలో దసరా పండుగ వేళ మాంసం కొనుగోళ్లు ఇవాళ ఊపందుకున్నాయి. కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.275-300, లైవ్ చికెన్ రూ.150 ఉంది. శ్రీకాకుళం,ఆమదాలవలస, నరసన్నపేటలో మటన్ ధర ప్రాంతాన్ని బట్టి రూ 900- 1,000 పలుకుతోంది. పండగ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే మాంసం దుకాణాల వద్ద జనం బారులు తీరారు. ప్రాంతాలు బట్టి ధరలు మారవచ్చునని వ్యాపారస్తులు తెలిపారు.