ATP: రాయదుర్గం మండలం పల్లేపల్లిలో పండగ వేళ విషాద ఘటన జరిగింది. కర్ణాటక రాష్ట్రం జీరిపల్లికి చెందిన శివ అనే వ్యక్తి దసరా పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి, అత్తవారింటికి వచ్చి, గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొన్నాడు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
పల్లేపల్లిలో పండుగ వేళ విషాదం


