ప్రకాశం: గిద్దలూరులో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయం ఆవరణలోకి నీరు చేరింది. స్వల్ప వర్షానికే ఈ పరిస్థితి నెలకొనడంతో డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి మళ్లింపు నిర్వహణపై చర్చ మొదలైంది. వర్షపు నీరు కార్యాలయ ఆవరణలోకి చేరకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలోకి నీరు


