హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైన్ స్నాచింగ్ కేసులో దొంగ అరెస్టు

కృష్ణా: చైన్ స్నాచింగ్ కేసులో దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 15న చల్లపల్లి మండలం శ్రీనగరులో మహిళ మెడ నుంచి నాగాయలంక మండలం పుల్లయ్య గారి దిబ్బకు చెందిన ఆరేవరపు శ్రీనివాసరావు నల్లపూసల గొలుసు చోరీ చేసి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. చల్లపల్లి పోలీసులు అతడిని కనిపెట్టి, అరెస్టు చేసి గొలుసు రికవరీ చేశారు. నేరం చేయడానికి ఉపయోగించిన బైక్, ఫోన్ సీజ్ చేశారు.