హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా సేవా కార్యక్రమాలు

KNR: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సతీమణి శాలిని రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట, హుజురాబాద్ పట్టణాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేయగా, హుజురాబాద్‌లో మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరలు, పురుషులకు దుస్తులు అందజేశారు. ఎమ్మెల్యే దంపతులు స్వయంగా పంపిణీ చేసి, చిరు వ్యాపారులకు ఉపాధి భరోసా కల్పించారు.