హైదరాబాద్: 28°C
తెలంగాణ

పటాన్చెరు ప్రజలకు ఎమ్మెల్యే దసరా శుభాకాంక్షలు

SRD: పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు అద్భుత ప్రగతి సాధించిందన్నారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.