హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.20 లక్షల ఆదాయం.. వసతులు అంతంతే!

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంగా మారడంతో పాటు మహాలక్ష్మి పథకం అమలుతో బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. 15 మండలాల ప్రజలు రాకపోకలు సాగిస్తుండగా, 5 ప్లాట్‌ఫాంలే ఉండటంతో వసతుల కొరత వేధిస్తోంది. రోజూ 89 బస్సులు 81 షెడ్యూళ్లలో నడుస్తూ 30 వేల మందికి సేవలందిస్తున్నాయి. రోజుకు రూ.20 లక్షల ఆదాయం వస్తున్నా బస్టాండ్‌ విస్తరణపై అధికారులు దృష్టి సారించాలన్నారు.