MLG: గోవిందరావుపేట మండల కేంద్రం శివారులోని సోమలగడ్డ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై డివైడర్ ప్రారంభమయ్యే చోట ఏర్పాటు చేసిన దిమ్మె వాహనాల ఢీకొనడంతో ధ్వంసమైంది. దీంతో రాత్రివేళ డివైడర్‌ను గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. జాతీయ రహదారి అధికారులు వెంటనే దిమ్మెను పునర్నిర్మించి, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
ధ్వంసమైన దిమ్మె.. వాహనదారులకు ప్రమాదం


