VKB: అనంతగిరిపల్లి ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి నూతన బోరును మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్య తీరడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. బోరు ఏర్పాటుకు సహకరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చైర్పర్సన్ అనన్యకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
అనంతగిరిపల్లిలో తాగునీటి బోరు ప్రారంభం


