SDPT: కొమురవెల్లి క్షేత్రంలో మంగళవారం శ్రీమల్లికార్జున స్వామివారి దివ్యదర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితులు మల్లన్నకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు రమణీయంగా నిర్వహించారు. భక్తులు ఒగ్గు సేవలతో మొక్కులు తీర్చుకున్నారు. దర్శనాలు వేగంగా జరిగేలా ఆలయ అధికారులు క్యూలైన్లను క్రమబద్ధీకరించారు.
తెలంగాణ
మల్లన్న క్షేత్రంలో ప్రత్యేక పూజలు


