హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బావిలో పడ్డ యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు

NTR: పెనుగంచిప్రోలు గ్రామ శివారులోని లింగం రోడ్డులో వ్యవసాయ బావిలో షేక్ గఫూర్ అనే యువకుడు సోమవారం పడిపోయిన విషయం తెలిసిందే. పోలీసులు గజ ఈతగాళ్లతో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఇంజన్ సహాయంతో బావిలోని నీటిని తోడినా మృతదేహం లభించలేదు. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.