SRCL: ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలోని పురాతన బురుజు దసరా వేళ నూతన శోభను సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న చారిత్రక కట్టడాన్ని సర్పంచ్ బొమ్మెన ఆంజనేయులు, ఉప సర్పంచ్ రంజిత్ ఆధ్వర్యంలో పునరుద్ధరించి, రంగులద్ది విద్యుత్ దీపాలతో అలంకరించారు. గ్రామ చరిత్రకు గుర్తుగా నిలిచిన బురుజు రంగురంగుల కాంతులతో వెలుగులు విరాజిల్లుతుంది.
తెలంగాణ
చికోడ్ పురాతన బురుజుకు నూతన శోభ


