హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేటలో బైక్ దగ్ధం

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు బీసీ కాలనీలో అర్ధరాత్రి ద్విచక్రవాహనం కాలిపోయిన ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ ఇంటి బయట నిలిపిన బైక్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అందరూ నిద్రిస్తుండగా మంటలు వ్యాపించి వాహనం కాలి బూడిదైంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.