హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజరాజేశ్వరి దేవిగా వాసవీ మాత దర్శనం

PLD:​ రొంపిచర్లలో విజయదశమి సందర్భంగా స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేముల రావు శర్మ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక కుంకుమ పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం శమీ పూజ, అన్నదానం ఉంటాయని ధర్మకర్త మద్ది రామచంద్రరావు తెలిపారు.