హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ విషాదం.. బావిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

KMM: కూసుమంచి లింగారంతండాలో దసరా పండుగ రోజున విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంలో డిగ్రీ చదువుతున్న బానోతు అజయ్‌కుమార్ (19) పొలం వద్ద మోటార్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఏడాది క్రితమే భర్తను కోల్పోయిన తల్లి వనితకు పెద్ద కుమారుడు దూరం కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.