హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లిమర్లలో కూటమి అసమ్మతికి చెక్ పడేనా?

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించడంపై టీడీపీ, జనసేనలో అసంతృప్తి నెలకొంది. బీజేపీ నుంచి మైపాడ ప్రసాద్ నామినేషన్ వేయగా, మిత్రపక్షాల అభ్యర్థులు సైతం బరిలో నిలిచారు. దీంతో నిన్న మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు సమావేశమై అసమ్మతిని చల్లార్చే ప్రయత్నం చేశారు.