హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి ఊరేగింపులకు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్

దసరా సందర్భంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు ఊరేగింపు పై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సెక్షన్ 30 అమలులో ఉంది. దీంతో ఊరేగింపులు, ర్యాలీలు, డీజేలకు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. దీంతో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.