హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరం సత్యదేవుని ఆదాయం రూ.40 లక్షలు

KKD: దసరా వేడుకల్లో భాగంగా మహర్నవమి సందర్భంగా సోమవారం అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయంలో 2,500 వ్రతాలు జరగగా, వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి ఒక్కరోజులో రూ.40 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.