VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిన్న సీఐ విజయకుమార్ నిర్వహించారు. ముందుగా గ్రామస్తులతో మమేకమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఎన్నికలో పాత తగాదాలకు దూరంగా ఉండి ఓటు హక్కును సజావుగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికాకుండా నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఓటు హక్కును సజావుగా వినియోగించుకోవాలి'


