హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజకీయ పార్టీలతో ఎంపీడీవో సమావేశం

NLR: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఇందుకూరుపేట ఎంపీడీవో నాగేంద్రబాబు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలన్నారు.