కోనసీమ: రావులపాలెం మండలం ఈతకోట టోల్ ప్లాజా వద్ద సోమవారం రవాణాశాఖ అధికారులు 21 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 6 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.10,200 జరిమానా విధించారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని డీటీఓ దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ బస్సుల తనిఖీలు... రూ. 10,200 జరిమానా


