KNR: హుజూరాబాద్ (M) కాట్రపల్లిలో పశువుల చోరీ ఘటన కలకలం రేపింది. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి పశువులు అపహరణకు గురైనట్లు బాధితుడు తాళ్లపల్లి ఐలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాచారం, గొడిశాల గ్రామాలకు చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చోరీ వెనుక మరికొందరి ప్రమేయంపై విచారణ కొనసాగుతోందని అన్నారు.
తెలంగాణ
కాట్రపల్లిలో పశువుల చోరీ.. ఇద్దరు అదుపులోకి!


