హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

AKP: రాయగడ రైల్వే డివిజన్‌లో కొండచరియలు విరిగిపడటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రేపటి నుంచి 28 వరకు కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని కొరాపుట్ వరకే నడపనున్నారు. విశాఖపట్నం–కిరండూల్ (18515/16) ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. కిరండూల్–విశాఖపట్నం (58502) ప్యాసింజర్ రైలును కొరాపుట్ వరకే నడపనున్నారు.