RR: మొయినాబాద్ మండలం అమ్డాపూర్లో చోరీ జరిగింది. కట్కూరి రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న విహారయాత్రకు వెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా, తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లోని బంగారు నగలు, వెండి సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, ఇన్స్పెక్టర్ వై. మల్లికార్జునరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
తాళం వేసిన ఇంట్లో బంగారు నగలు మాయం


