WGL: విజయదశమి సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలంతా కులమత భేదాలకు అతీతంగా పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. వేడుకల్లో భద్రతా నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలన్నారు.
తెలంగాణ
'శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా దసరా జరుపుకోవాలి'


