హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాలపిట్టను బంధిస్తే కఠిన చర్యలు'

KMR: దసరా పండగ సందర్భంగా పాలపిట్టను బంధించి ప్రదర్శించడం నేరమని నాగిరెడ్డిపేట మండల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాసుదేవ్ సోమవారం తెలిపారు. ఎవరైనా పాలపిట్టను బంధిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పంటలకు హాని చేసే గొల్లభామలు, మిడతలు వంటి కీటకాలను తింటూ పాలపిట్ట రైతులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు.