WG: మొగల్తూరులోని ప్రధాన కాలువలో పడి డాక్యుమెంట్ రైటర్ రాజేశ్(31) మృతి చెందాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేశ్ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. సోమవారం ప్రధాన కాలువలో మృతదేహం లభ్యమవ్వడంతో కుటుంబ సభ్యులు రాజేశ్ గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలో పడి యువకుడి మృతి


