WGL: విజయదశమి పర్వదినం నగర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐకమత్యం మరింత బలపడాలని కోరుకుంటూ.. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి: కమిషనర్


