E.G: రంగంపేట మండలంలో ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్ల చోరీలతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రంగంపేట-గండేపల్లి మధ్య 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ను పగలగొట్టి కాపర్ వైర్లు, ఆయిల్ చోరీ చేశారు. మండలంలో కొన్నేళ్లుగా ఈ దొంగతనాలు పునరావృతమవుతున్నాయి. ఫిర్యాదులు ఇవ్వడం, కేసులు నమోదు కావడం తప్ప ఉపయోగం లేదని రైతులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాపర్ వైర్ల చోరీ... రైతులు ఆందోళన


