తూర్పుగోదావరి జిల్లాలో 21 ZPTC, 412 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో 12,02,548 మంది ఓటర్ల కోసం 1,476 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ బరిలో 12 లక్షల మంది ఓటర్లు: కలెక్టర్


