హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో గెలవలేకే TDP దౌర్జన్యాలకు దిగుతోంది'

E.G: దేశం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు బదులుగా నకిలీ ప్రభుత్వాలు నడుస్తున్నాయని YCP రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేశ్ ఆరోపించారు. సోమవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో గెలవలేకే TDP దౌర్జన్యాలకు దిగుతోందన్నారు. రాయలసీమ, పల్నాడులో దాడులతో ఇతర ప్రాంతాలను భయపెడుతోందని విమర్శించారు.