HNK: కాజీపేట మండలం సోమిడి శివారులోని రేణుక ఎల్లమ్మ చెరువులో కొలిపాక కుమార్ (58) అనే వ్యక్తి నీటమునిగి మృతి చెందాడు. బతుకమ్మ పండుగ కోసం తామర పూలు తెంపేందుకు చెరువులోకి దిగగా, నీటిలోని మొక్కల్లో చిక్కుకుని బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇవాళ ఆయన మృతదేహం నీటిపై తేలడంతో గమనించిన పోలీసులు వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
తామర పూల కోసం వెళ్లి చెరువులో మృతి


