E.G: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. సోమవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఇంఛార్జ్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి ఆయన అభ్యర్థులు, నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, వార్డుల్లో సమష్టిగా పనిచేసి మద్దతు కూడగట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థులతో మంత్రి సమావేశం


