MHBD: కురవి మండలం పోలెంపల్లి తండాకు చెందిన కావేరి (20) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఏడాది క్రితం భూక్య సంతోష్‌తో ఆమెకు వివాహమైంది. సెప్టెంబర్ 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందగా, తండ్రి దేవిసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.
తెలంగాణ
చికిత్స పొందుతూ వివాహిత మృతి


