హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ తిరస్కరణపై కాకాణి నిరసన

నెల్లూరు 63వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి షేక్ సిద్ధిఖీ నామినేషన్ తిరస్కరణను నిరసిస్తూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నామినేషన్ కేంద్రం వద్ద బైఠాయించారు. అధికార పార్టీ ఒత్తిడితోనే నామినేషన్ తిరస్కరించారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.