హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: ముద్రగడ

KKD: రౌతులపూడి మండలం కోడూరులో ప్రత్తిపాడు YCP ఇంఛార్జ్ ముద్రగడ గిరిబాబు సోమవారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు ప్రజలు శాలువాలు, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని వినాయక స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ ఐక్యంగా కృషి చేయాలన్నారు.