SRCL: ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె, ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామాల మధ్య ఎగువ మానేరు వాగుపై వంతెన లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాగు పొంగితే ఇరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇటీవల వరద ఉద్ధృతికి వాహనదారులు కొట్టుకుపోయిన ఘటన కూడా జరిగింది. ప్రత్యామ్నాయ మార్గంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
వంతెన లేక ఇరు మండలాల ప్రజలకు ఇక్కట్లు


