కోనసీమ: TDP కార్యాలయ భూమి కేటాయింపుపై ప్రశ్నించినందుకే 15వ వార్డు YCP అభ్యర్థి చంద్రశేఖర్‌పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని YCP జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. సోమవారం రాత్రి అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వయంగా NOC ఇచ్చిన మున్సిపల్ కమిషనరే నామినేషన్ తిరస్కరించారని మండిపడ్డారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశ్నించినందుకే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు'


