హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధ్యతలు స్వీకరించిన నూతన మున్సిపల్‌ కమీషనర్

PPM: సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌గా బి. శంకరరావు నిన్న బాధ్యతలు స్వీకరించారు. GVMC (విశాఖ) లో విధులు నిర్వర్తించిన ఆయన, బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటివరకూ ఇక్కడ ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బి.వి. ప్రసాద్‌ ఇకపై ఇంజినీరింగ్‌ విభాగంలో విధులు నిర్వహించనున్నారు. నూతన కమిషనర్‌కు సిబ్బంది స్వాగతం పలికారు.