హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తతో నిండిన సాగునీటి కాలువ

PDPL: సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువ దయనీయంగా మారింది. కాలువలో చెత్త పేరుకుపోగా, చుట్టూ దట్టంగా మొక్కలు పెరిగాయి. దీంతో సాగునీరు విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలోని చెత్తను తొలగించి, మొక్కలను శుభ్రం చేయాలని రైతులు కోరుతున్నారు.