హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె మలుపు వద్ద సోమవారం రాత్రి ఆటోను బైక్ ఢీ కొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పిట్టావాండ్లపల్లెకు చెందిన ఇమ్మాని (25), లోకేష్(19) బైకులో మదనపల్లె వెళ్తుండగా, మదనపల్లె నుంచి నిమ్మనపల్లె వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటోలోని నలుగురు, బైక్‌లోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.