హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల స్వీకరణ

చిత్తూరులో రేపటి నుంచి ఈ నెల 24 వరకు అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను స్వీకరించనున్నారు. పీలేరు, కలకడ, కేవీ పల్లి, కలికిరి, వాయల్పాడు, గుర్రంకొండ ప్రాంతాల బాధితులు చిత్తూరు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న సాయుధ దళ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్లు సమర్పించాలి. అసలు బాండ్తో పాటు ఆధార్, ఇతర అవసరమైన పత్రాలు తీసుకురావాలన్నారు.