హైదరాబాద్: 28°C
తెలంగాణ

పైపులైన్ లీకేజీ.. వృథా అవుతున్న శుద్ధ జలం

PDPL: ధర్మారం 10 ఎంఎల్‌డీ ప్లాంటు నుంచి గ్రామాలకు నీరందించే ప్రధాన పైపులైన్‌కు రెండేళ్లుగా లీకేజీ ఉంది. ఈ ఏడాది లీకేజీ మరింత పెరగడంతో శుద్ధి చేసిన నీరు వృథా అవుతోంది. కల్వర్టుపై నీరు నిలిచి మడుగులా మారినా మరమ్మతులు చేపట్టడం లేదు. ధర్మారంతో పాటు కటికెనపల్లిలోనూ లీకేజీలు ఉన్నాయి. అధికారులు స్పందించి తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.